ఈ సంవత్సరం గేమ్ ఛేంజర్ రిలీజ్ ఉంటుందా..? లేదా..?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్” Game Changer). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది . అలాగే అంజలి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో రాంచరణ్ రెండు విభిన్న పాత్రలలో నటించనున్నారు . ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితం మొదలైన కూడా ఇంకా పూర్తి కాలేదు. కొన్ని అనుకోని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుంది .

ఈ సినిమాతో పాటు, డైరెక్టర్ శంకర్ విశ్వనటుడు కమల్ హాసన్ తో 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ గా 'భారతీయుడు 2 (Bharateeyudu 2)' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా వుంది. ఈ సినిమాను జూన్ లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు . అయితే “గేమ్ చేంజర్” సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నట్లు గతంలో దిల్ రాజు ప్రకటించారు . అయితే ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం లేదు తెలుస్తోంది. ఆ టైం లో ఎన్టీఆర్ నటిస్తున్న “దేవర” (Devara) సినిమా రిలీజ్ వుంది. అక్టోబర్ కంటే ముందు ఆగస్టులో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, ఆ నెలలో ”పుష్ప 2” (Pushpa 2) మూవీ రిలీజ్ కానుంది. అలాగే సెప్టెంబర్ 27 న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న “ఓజి “మూవీ రిలీజ్ కానుంది. దీనితో “గేమ్ చేంజర్” మూవీ ఈ దీపావళికి రిలీజ్ అవ్వడం లేదు అని అనిపిస్తుంది

0/Post a Comment/Comments